హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

NRML: కుభీర్ మండలంలోని ధార్ కుభీర్, బెల్గావ్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమిపూజ చేశారు. ధార్ కుభీర్, బెల్గావ్ గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు, గోదాంలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామస్థులు పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసానిచ్చారు.