హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారామపురంలో చేపలు, కొబ్బరి ఫలసాయానికి వేలం పాట

ELR: సీతారామపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని చేపల చెరువులు, కొబ్బరి చెట్ల ఫలసాయాన్ని పొందేందుకు ఈ వేలం నిర్వహించారు. పంచాయతీ అధికారులు, సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ వేలంలో పలువురు రైతులు, వ్యాపారులు పాల్గొని పోటీపడి పాటలు పాడారు.