MBNR: బీజేపీ ఎంపీ డీకే అరుణ డిండి ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నీటి మళ్లింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వీడాలని కోరారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు ఉంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
డిండి ప్రాజెక్టును నిలిపివేయాలి: డీకే అరుణ


