ముస్లింలకు అర్థవంతమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు విఫలమయ్యాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ముస్లింలను సమాన రాజకీయ భాగస్వామిగా చూడకుండా కేవలం ఓటు బ్యాంకుగా మార్చేశాయని ధ్వజమెత్తారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ముస్లింలకు స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని కోరుకోవడంలేదని వెల్లడించారు.
వార్తలు
ముస్లింలను ఓటర్లుగానే చూస్తున్నారు: ఓవైసీ


