SDPT: ప్రతి రైతు గుర్తింపు కార్డు కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బెజ్జంకి మండల వ్యవసాయాధికారి పూజా సూచించారు. రైతు వేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పంటల నమోదు, విక్రయాలు, యూరియా బుకింగ్‌తో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధికి కార్డు ఉపయోగపడుతుందన్నారు. మండలంలో 80 శాతం రిజిస్ట్రేషన్ పూర్తయిందని, మిగిలిన రైతులు నమోదు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ప్రతి రైతు గుర్తింపు కార్డు కలిగి ఉండాలి: AO


