హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు అండగా పట్నం నరేందర్ రెడ్డి

NRPT: మద్దూర్ మండలంలో బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరామర్శించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులు తమ ఆవేదనను ఆయనకు వివరించారు. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 200 గజాల ఇంటి స్థలం కల్పించాలని డిమాండ్ చేశారు.