హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీమకుర్తిలో ప్రమాదకరంగా వంతెన

ప్రకాశం: చీమకుర్తి నుంచి కె.విపాలెం వెళ్లే రహదారిలో కాలువపై వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెనకు ఇరువైపులా ఉన్న రేలింగులు విరిగిపోయాయి, సైడ్ వాల్ కూలిపోయి ఉంది. ఈ రహదారి గుండా కొన్నిగ్రామాల ప్రజలు రోజు ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. వాహనాలు వెళ్లే సమయంలో ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి కొత్త వంతెనను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.