హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒకే గదిలో రెండు తరగతులు

SRD: నాగల్గిద్ద మండలం ఔదాపూర్‌లో ప్రభుత్వ పాఠశాల ఆరో తరగతి విద్యార్థులకు అంగన్వాడీ గదిలోనే బోధన సాగుతోంది. ఒకే గదిలో రెండు తరగతులు నిర్వహించడంతో పాఠాలు వినేందుకు ఇబ్బందిగా ఉందని విద్యార్థులు తెలిపారు. అంగన్వాడీ చిన్నారులకు కూడా ఆటపాటలకు స్థలం సరిపోవడం లేదన్నారు. ఆరో తరగతికి ప్రత్యేక గది కేటాయించాలని కోరుతున్నారు.