హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

BPT: అమృతలూరు మండలంలోని పలు గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలిపారు. అమృతలూరు ఎస్సీ కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. రోడ్ల నిర్మాణంతో ప్రజల రాకపోకలు సులభతరమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.