హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం

విశాఖలోని స్టీల్ ప్లాంట్ SMS-1 విభాగంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ తెగిపోవడంతో ఉక్కు ద్రవం నేలపాలు అయ్యింది. అయితే, కార్మికులు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్లాంట్‌లో జరుగుతున్న వరుస ప్రమాదాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.