BPT: ఆరోగ్యవంతమైన తరానికి పౌష్టికాహారమే కీలకమని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు తెలిపారు. రామకృష్ణపురం అంగన్‌వాడీ పరిధిలో రావుల మణికుమార్, సరోజినీ దేవి సౌజన్యంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, సహాయ సామగ్రి పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ పోషకాహారానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమం చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలింతలకు పౌష్టికాహారం అత్యంత కీలకం


