హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్య పరిష్కరించాలని సీపీఐ రాస్తారోకో

అన్నమయ్య: రాయచోటిలోని ఏజీ గార్డెన్‌ ఇందిరమ్మ కాలనీ తాగునీటి సమస్య పరిష్కరించాలని మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో కడప–బెంగళూరు జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నిరసనతో భారీగా ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు.