హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మురుగు కాలవలు ఏర్పాటు చేయాలి'

AKP: ఎస్.రాయవరం మండలం దార్లపూడి పిట్టలవారి వీధిలో మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం సచివాలయంలో ఐద్వా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి. మాణిక్యం మాట్లాడుతూ.. మురుగునీరు ఇళ్ల ముందే నిల్వ ఉండటంతో 50 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం కలగడంతోపాటు విషజ్వరాల బారిన పడుతున్నారన్నారు.