హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు రైతు బజార్‌ ప్రారంభం..!

CTR: పుంగనూరు పట్టణం AMC ఆవరణలో రేపు రైతు బజార్‌ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఛైర్మన్ సెమిపతి యాదవ్ మంగళవారం ఏర్పాట్లును పరిశీలించారు. బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. రైతులకు, వినియోగదారులకు మరింత చేరువగా రైతు బజార్లు దోహదపడతాయని ఆయన తెలిపారు. అలాగే హైమాస్ లైట్లు, రోడ్లు, క్యాటిల్ షెడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.