హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగర అభివృద్ధిపై కమిషనర్ సమీక్ష

ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య (IAS) ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగర పరిధిలోని పలు ప్రధానాంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నగర అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతినిధులు అందించిన విలువైన సలహాలు, సూచనలను కమిషనర్ స్వీకరించారు.