హైదరాబాద్: 28°C
వార్తలు

బీఆర్ఎస్ పార్టీకి పెరిగిన విరాళాలు

TG: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేనప్పటికీ పార్టీకి విరాళాలు తగ్గకపోగా, గతేడాది కంటే పెరగడం చర్చనీయాంశంగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ బీఆర్ఎస్ పార్టీకి రూ.16.4 కోట్ల విరాళాలు అందినట్లు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదికలో ఆ పార్టీ పేర్కొంది. 2024-25లో రూ.15.1 కోట్ల విరాళాలు అందాయి. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా పార్టీకి నిధుల ప్రవాహం పెరగడం గమనార్హం.