హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరరాజాలో యువతకు ఉచిత శిక్షణ

KRNL: అమరరాజా సంస్థ ఆధ్వర్యంలో యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి ఇవాళ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులైన 16-30 ఏళ్ల యువత అర్హులన్నారు. శిక్షణలో రూ.13,192-16,500 స్టైఫండ్, ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. ఈ నెల 30న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఎంపిక జరుగుతుందని తెలిపారు.