హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎడ్లపాడులో ఎస్ఎంసీ ఎన్నికల రగడ

PLD: ఎడ్లపాడు(మం) తిమ్మాపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ఎస్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలను అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు పాఠశాలలోకి రావడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఘటనలో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. హెడ్మాస్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఎంఈవో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.