హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైదులు మృతి బాధాకరం

SRPT: మునగాల మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన సైదులు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో మునగాల మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.