హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో కిక్కిరిసిన భక్తులు

కృష్ణా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి చేరుకొని స్వామివారి నాగపుట్టలో పాలు పోసి వారి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ స్వామిని దర్శించుకొని, ఆవరణలో గల నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు.