హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

ప్రకాశం: పల్లె పండుగ 3.0లో భాగంగా టంగుటూరు(M) శివపురంలో తారు రోడ్డు నిర్మాణానికి మంత్రి స్వామి మంగళవారం శంకుస్థాపన చేశారు. కొండపి నియోజకవర్గంలో 13 కనెక్టివిటీ రోడ్లు నిర్మాణానికి 24.2 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 2018 ఫిబ్రవరిలో ఏషియన్ బ్యాంకు నుంచి పనులు తీసుకొచ్చాం అని చెప్పుకొచ్చారు.