హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయమైన డిమాండ్ల కోసం రిటైర్డ్ పెన్షనర్ల ధర్నా

BPT: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బాపట్ల కలెక్టరేట్ వద్ద రిటైర్డ్ పెన్షనర్లు ధర్నా చేపట్టారు. పెన్షన్ రూల్స్-2025 చట్టాన్ని రద్దుచేయాలని, 8వ వేతన సంఘంలో పెన్షన్ సవరణ చేర్చాలని నినదించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మధ్యంతర భృతిని ప్రకటించడంతో పాటు రైల్వే, విమాన ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీలు కల్పించాలన్నారు.