హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాండవగల్లు ఎస్‌ఎంసీకి కొత్త కమిటీ

KRNL: ఆదోని (మం) పాండవగల్లు పాఠశాల నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ మద్దతుదారు జే. లక్ష్మి, వైస్‌ఛైర్మన్‌గా సీపీఎం మద్దతుదారు కే. మంజునాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానోపాధ్యాయురాలు ఫరీద్‌ సుల్తానా నూతన కమిటీతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్మన్‌ తెలిపారు.