హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో మున్సిపల్ కార్మికుల నిరసన

NTR: నందిగామ గాంధీ బొమ్మ సెంటర్‌లో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. వారికి సీఐటీయూ నాయకులు గోపాల్ సంఘీభావం తెలిపారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం నెలకు రూ.42 వేల వేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు.