ASR: ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) ఇంఛార్జ్ బాధ్యతలను ఏటీడబ్ల్యూవో రజనికి అప్పగించడంపై టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు ఐ.రామకృష్ణ తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన మంగళవారం పార్వతీపురంలో మాట్లాడారు. రజని కంటే కృష్ణవేణి సీనియర్ అని తెలిపారు. సీనియారిటీ ప్రకారం డీడీ ఇంఛార్జ్ బాధ్యతలను కృష్ణవేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై ITDA PO ఆలోచన చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ సీనియర్‌కే ఇవ్వాలి'


