హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

14వ రోజుకు చేరిన VRAల నిరసన

కోనసీమ: అమలాపురం డివిజన్‌లో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA) నిరసన 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా VRAలు ర్యాలీగా వెళ్లి RDOను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, అర్హత-సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు శాంతియుతంగా నిరసన కొనసాగిస్తామన్నారు.