హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలను వేధించే పురుషులు మారాలి: రాహుల్

మహిళలపై నేరాలకు వారినే బాధ్యులను చేయొద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. మహిళలను ఇళ్లకే పరిమితం చేయడం పరిష్కారం కాదని పేర్కొన్నారు. మహిళలను వేధించే పురుషులు మారాలని పిలుపునిచ్చారు. వారి పట్ల జరుగుతున్న దాడులపై వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను రక్షించే వ్యవస్థను మార్చాలని కోరారు. వారి భద్రతపై ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.