హైదరాబాద్: 28°C
వార్తలు

SIR వెనక కుట్ర దాగి ఉంది: ఖర్గే

ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మోదీ ప్రభుత్వానికి కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా నిరోధించేందుకే మోదీ ఈ కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఇందుకోసం కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫామ్-6 నియమాలను చట్టవిరుద్ధంగా మార్చారని దుయ్యబట్టారు.