హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు చేరుకున్న వైఎస్ జగన్

ప్రకాశం: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ఒంగోలు చేరుకున్నారు. ఆయనకు వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల మృతి చెందిన వైసీపీ నేత కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ఒంగోలు వచ్చారు. రాజశేఖర్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేయనున్నారు.