PPM: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలకు వెళ్లే రహదారి కోతకు గురై నాలుగు రోజులవుతున్నా అధికారులు చర్యలు చేపట్టలేదు. పాఠశాలతో పాటు గిరిజన కళాశాల వసతి గృహం ఉండటంతో సుమారు 400 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కోతకు గురైన చోట ఇనుప గేటు ఏర్పాటు చేసుకుని తాత్కాలికంగా దాటుతున్నారు. పట్టు తప్పితే గోతిలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆశ్రమ పాఠశాల దారికి ప్రత్యామ్నాయం ఏదీ?


