సత్యసాయి జిల్లా ధర్మవరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. తెల్లవారుజామున నాలుగు ఇళ్లల్లో చోరీలకు యత్నించారు. ఇంటి కిటికీ తలుపులు పగలగొట్టేందుకు దుండగులు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఇంటి యజమానులు మేల్కొనడంతో దొంగలు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం


