ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమీప గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రిని కలిశారు. వినతి పత్రాలు రూపంలో తన సమస్యలను వివరించారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి


