హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయలక్ష్మిపురంలో చెత్తకుప్పలతో అవస్థలు

BPT: బాపట్లలోని విజయలక్ష్మిపురంలో రోడ్లు చెత్తాచెదారాలతో నిండిపోయాయి. ఇళ్ల ముందు చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది పనితీరును మేస్త్రీలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షించడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.