హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా ముగిసిన విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు

NDL: నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో మంగళవారం విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యా కమిటీ చైర్మన్‌గా చిన్న ఓబులేసు, వైస్ చైర్మన్ పుష్పావతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిని గ్రామ వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు గెలవడం సంతోషంగా ఉందని వారు అన్నారు.