హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛా ప్రాజెక్ట్ కాలువల పనుల పరిశీలన

అన్నమయ్య: సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల్లో ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న పనులను రాయలసీమ జోన్ అగ్రికల్చర్ అధ్యక్షులు అమ్రూ నాయక్, టెక్నికల్ అసిస్టెంట్ సూపర్‌వైజర్ రవీంద్ర పరిశీలించారు. కాలువల్లోని మట్టిని, ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని కూలీలకు సూచించారు.