హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

GNTR: పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురం అల్లంవారిపాలెంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.