హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

ప్రకాశం జిల్లా అద్దంకిలోని శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. మంగళవారం ఉదయం సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని శివలింగాన్ని తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణాయనంలో ఏటా మూడు రోజుల పాటు ఈ సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయని ఆలయ పూజారి తెలిపారు.