KRNL: ఎమ్మిగనూరు ఎస్‌ఎంఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ మహబూబ్ బాషా తెలిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జరిగే మేళాలో 170 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఎస్ఎస్‌సీ నుంచి పీజీ వరకు అర్హతతో 18–35 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మిగనూరులో రేపు మెగా జాబ్ మేళా


