సత్యసాయి: కదిరిలోని R&R కాలనీలో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. కొత్త బోరు మోటార్ ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. నీటి కష్టాలు తీరడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'థాంక్యూ ఎమ్మెల్యే సార్.. తాగునీటి కష్టాలు తీర్చారు!'


