హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవంగా పేరెంట్స్ కమిటీ ఛైర్మన్‌ ఎన్నిక

ASR: జిల్లాలోని చింతపల్లి మండలం వీరవరం ఎంపీపీ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఛైర్మన్‌గా జి.చల్లారావు, వైస్‌ ఛైర్మన్‌గా పి.సీతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా సీఆర్‌పీ పి.రాము హాజరై ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. నూతన కమిటీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.