హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎ.కొండూరులో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం

NTR: ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో కురిసిన అకాల వర్షానికి దాదాపు 100 ఎకరాల్లో బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. పంట కోత దశకు వచ్చిన సమయంలో వర్షం ముంచెత్తడంతో చెట్లు, కాయలు పాడైపోయి భారీగా పెట్టుబడులు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.