హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ షాక్‌‌తో ఇద్దరు మృతి

NTR: రెడ్డిగూడెం మండలం రంగపురంలోని వ్యవసాయ భూమిలో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మైలవరం మండలం జంగలపల్లికి చెందిన అరేపల్లి చిన్నారావు, రెడ్డి నాగరాజుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడం వల్లే చనిపోయారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.