AKP: నాతవరం మండలం మాధవనగరం గ్రామంలో మంగళవారం శ్రీ నల్లకొండమ్మ తల్లి అమ్మవారి పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో నల్లకొండమ్మ తల్లి పండుగ


