ATP: అనంతపురంలో చైన్ స్నాచర్లు హల్‌చల్ చేశారు. మంగళవారం ఉదయం ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి ఐదు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వినాయక్ నగర్, సాయి నగర్, రుద్రంపేట బైపాస్, బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ప్రాంతా ల్లో ఈ చోరీలు జరిగాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో చైన్ స్నాచర్ల బీభత్సం


