హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుక్కపట్నం పీఎస్‌కు ద్విచక్రవాహనం విరాళం

సత్యసాయి: బుక్కపట్నం పోలీస్ స్టేషన్‌కు అదే గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రూ.1.40 లక్షల విలువైన నూతన ద్విచక్ర వాహనాన్ని విరాళంగా ఇచ్చారు. పుట్టపర్తి డీఎస్పీ సత్యనారాయణ, సీఐ సురేష్ ఈ వాహనాన్ని ఎస్సై నారాయణ రెడ్డికి అందజేసి ప్రారంభించారు. రాత్రి పెట్రోలింగ్, అత్యవసర సేవలు, రోడ్డు ప్రమాదాల నివారణకు దీనిని ఉపయోగిస్తారు.