హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె పండుగకు తరలిన టీడీపీ శ్రేణులు

ప్రకాశం: వరికుంటపాడు మండలంలో జరుగుతున్న పల్లె పండుగ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో మంగళవారం కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు వరికుంటపాడుకు బయలుదేరారు.