హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంతెనపై గుంతలు.. ప్రయాణికులకు తిప్పలు

VZM: చీపురుపల్లిలో విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపై వంతెన గుంతలమయంగా మారింది. ఈ మార్గంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. వంతెనపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.