హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

GNTR: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీమటా భాస్కర్ అనే రైతు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం తన వ్యవసాయ పొలంలో ఉన్న వేపచెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.