హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టుమార్టం కేంద్రానికి ఇదేం దారి?

SKLM: నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని పోస్టుమార్టం కేంద్రానికి వెళ్లే దారి అధ్వానంగా మారింది. వర్షాలతో రహదారిపై నీరు, బురద చేరడంతో అంబులెన్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్యులు, మృతుల కుటుంబ సభ్యులు కూడా నడవలేని పరిస్థితి నెలకొంది. పోస్టుమార్టం కేంద్రానికి సరైన రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.