హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా

AKP: నర్సీపట్నంలో అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై అధికారులు మంగళవారం చర్యలు చేపట్టారు. తహసీల్దార్‌ ఎల్‌.రామారావు ఆదేశాలతో సీఎంఆర్‌ ఎదురుగా, అల్లూరి సెంటర్‌ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.